ఉత్సాహంగా గురుకుల స్పోర్ట్స్‌‌మీట్‌‌

  • మెదక్ లో ప్రారంభమైన జోనల్ ​లెవల్ ​పోటీలు

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్​లో సోమవారం 10వ రాష్ట్రస్థాయి జోనల్‌‌ స్పోర్ట్స్‌‌ మీట్‌‌ అట్టహాసంగా ప్రారంభమైంది. డీఎస్పీ ప్రసన్న కుమార్, కో ఆర్డినేటర్​సువర్ణలత జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభించారు. నేషనల్,  ఒలంపిక్స్‌‌, సొసైటీ జెండాలను సీఐ నాగరాజు, తహసీల్దార్ లక్మణ్ బాబు ఎగురవేశారు. జోన్​ పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు చెందిన 13 గురుకుల స్కూళ్ల క్రీడాకారులు 1,105 మంది హాజరయ్యారు. 

ఇక్కడి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్​చదువుతోపాటు క్రీడా రంగంలోనూ రాణిస్తే  ఉజ్వల భవిష్యత్​ ఉంటుందన్నారు.  సీఐ నాగరాజు మాట్లాడుతూ శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. 

జిల్లా కో ఆర్డినేటర్, మెదక్ గురుకుల స్కూల్​ప్రిన్సిపాల్ సువర్ణ లత మాట్లాడుతూ నిరంతర సాధనతోనే స్టూడెంట్స్​అన్ని రంగాల్లో రాణించవచ్చని సూచించారు.  కార్యక్రమంలో, రామక్కపేట్, చిన్నబోనాల, బద్దెనపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ, చొప్పదండి, హుజూరాబాద్, నిర్మల, వర్గల్, గజ్వేల్, కొల్చారం, తూప్రాన్, రామాయంపేట రెసిడెన్సియల్​ స్కూల్ విద్యార్థులు, ​ ప్రిన్సిపల్స్​ పాల్గొన్నారు.