తాగి బండి నడిపినందుకు రూ. 10 వేల ఫైన్

లింగాల, వెలుగు : మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు రూ. 10 వేల జరిమానా విధించింది.  లింగాల ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం తెలకపల్లి నుంచి లింగాల వైపుగా కూల్ డ్రింక్ లోడ్ తో డీసీఎం రాగా మగ్దుంపూర్ చౌరస్తా వద్ద ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు.  

.ఇందులో డ్రైవర్ రవి  మద్యం తాగినట్లు తేలడంతో అతడిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం అచ్చంపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పదివేల జరిమానా విధించినట్లు తెలిపారు.