ఫ్లెక్స్శాలరీ కింద రూ. 100 కోట్ల అప్పులు ఇచ్చినట్లు హైదరాబాద్ ఫిన్టెక్ స్టార్టప్ వివిఫై ఇండియా ఫైనాన్స్ ప్రకటించింది. వ్యక్తిగత అవసరాలకు అప్పటికప్పుడే ఆన్లైన్లో అప్పులివ్వడం ఫ్లెక్స్శాలరీ ప్రత్యేకత. షార్ట్టర్మ్ అవసరాలకు తగిన డబ్బు లేనప్పుడు ఇబ్బంది పడే అవసరం లేకుండా ఈ ఫ్లెక్స్శాలరీ సాయపడుతుందని వివిఫై ఇండియా ఫైనాన్స్ తెలిపింది. శాలరీ ఉద్యోగుల కోసం ఈ ప్రొడక్ట్ను తెచ్చినట్లు పేర్కొంది. 35 వేల లోన్ల కింద ఈ రూ. 100 కోట్లను ఇచ్చినట్లు తెలిపింది. ఫ్లెక్స్శాలరీ కింద గరిష్టంగా రూ. 2 లక్షల దాకా అప్పు తీసుకోవచ్చని, ఆన్లైన్ ప్రాసెస్ చాలా సులభతరంగా రూపొందించామని వెల్లడించింది. రెండేళ్లలోనే రూ. 100 కోట్ల మైలురాయి అధిగమించడం కంపెనీకి గర్వకారణమని సీఈఓ, కో ఫౌండర్ అనిల్ పినపాల తెలిపారు. తక్షణ నగదు అవసరాలకు సాయపడుతుండటంతో ఫ్లెక్స్శాలరీకి తక్కువ కాలంలోనే ఆదరణ లభించిందని పేర్కొన్నారు. ఫ్లెక్స్శాలరీ యాప్ ఇప్పటికే 5 లక్షల డౌన్లోడ్లు పూర్తి చేసుకుందని, ప్రతి నెలా 70 వేల కొత్త లోన్ అప్లికేషన్స్ వస్తున్నాయని వెల్లడించారు. 97 శాతం మంది కస్టమర్లు తమ క్రెడిట్లైన్ను యాక్టివ్గా వాడుకుంటున్నట్లు అనిల్ తెలిపారు. కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసెస్ ఇవ్వడం మీదే ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. చిన్న జీతాల వారికీ అప్పులిస్తున్నామని, ట్రెడిషినల్ క్రెడిట్ స్కోరుకు ధీటుగా తమ సొంత మోడల్ను రూపొందించుకున్నామని అనిల్ వివరించారు.
