జన్ ధన్ యోజనకు పదేళ్లు.. 53కోట్ల అకౌంట్లు.. 2 లక్షల కోట్ల డిపాజిట్లు

జన్ ధన్ యోజన.. అట్టడుగు వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించటంకోసం మోడీ సర్కార్ 2014లో ప్రారంభించిన పథకం. ఈ పథకం ప్రారంభించి 10ఏళ్ళు పూర్తైన క్రమంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది యువత, మహిళలు, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలవారికి ఆర్థిక భద్రత, చేయూత లభించిందని అన్నారు.దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 53కోట్ల అకౌంట్లు ఓపెన్ అవ్వగా... వీటిలో 2.3లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చినట్లు సమాచారం.

Also Read:-బాలీవుడ్ నటి కేసులో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు.. బిగుస్తున్న ఉచ్చు..

2014 నుండి ఓపెన్ అయిన 53.13కోట్ల జన్ ధన్ ఖాతాల్లో 55.6శాతం మహిళలవే కావటం విశేషం. ఈ పథకం రూరల్, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఎక్కువ ఆదరణ కలిగి, మొత్తం అకౌంట్లలో 66.6% వాటా ఉందని తెలుస్తోంది. డిపాజిట్ డిపాజిట్లు రూ.2,31,236 కోట్లకు పెరిగి..  పథకం ప్రారంభమైనప్పటి నుండి డిపాజిట్లలో 15 రెట్లు, అకౌంట్లలో 3.6 రెట్లు పెరుగుదల నమోదు చేసింది. అకౌంట్లలో సగటు డిపాజిట్  రూ.4,352గా ఉన్నట్లు సమాచారం.

జన్ ధన్ పథకం ద్వారా అట్టడుగు వర్గాలు పొందే లబ్ది:

  • అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు.
  • డిపాజిట్లపై వడ్డీ కూడా వస్తుంది.
  • రూపే డెబిట్ కార్డ్ సదుపాయం.
  • రూ. 1 లక్ష ప్రమాద బీమా కవరేజీ (ఆగస్టు 28, 2018 తర్వాత ఓపెన్ చేసిన అకౌంట్లకు రూ. 2 లక్షలకు పెంచబడింది).
  • అర్హత కలిగిన ఖాతాదారులకు రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం.
  • డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ( DBT ), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), ముద్ర MUDRA స్కీమ్‌లకు అర్హత పొందే అవకాశం.