ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూన్ 25న అర్థరాత్రి రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ వైద్య కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని క్షతగాత్రులకు అన్ని విధాలా సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నామని గంజాం డీఎం దిబ్యా జ్యోతి పరిదా తెలిపారు.
ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
