న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం తజికిస్తాన్‌కు చెందిన ఒక బాలుడు సహా ముగ్గురు ప్యాసింజర్ల నుంచి రూ.10 కోట్ల విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వారు ఇస్తాంబుల్‌కు వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రాగా.. లగేజీని చెక్‌చేశారు. నిందితులు షూలలో కరెన్సీని దాచి, తమ లగేజీలో పెట్టుకొని తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. మొత్తం7,20,000 యూఎస్ డాలర్లు, 4,66,200 యూరోలు స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ ఇండియన్ కరెన్సీలో రూ.10.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఇండియాలోని ఎయిర్‌పోర్ట్‌లలో ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడడం ఇదే మొదటి సారి అని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
