ట్రెండ్ మారుతున్న కొద్దీ..... యూత్ కేరీర్ ను కొత్తగా ఉండేలా ఎంచుకుంటున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్స్ తో చదువు, కేరీర్ లో తమకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకుంటున్నారు. ఇప్పటి తరం యువత మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీల వైపు ఇంట్రెస్ట్ చూపిన్నారు. దీంతో హైదరాబాద్ లో బ్యూటీ పేజెంట్స్ లో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతోంది. కలర్ ఫుల్ లైఫ్ స్టైల్, సెలెబ్రెటీ స్టేటస్, సినిమాల్లో అవకాశాలు.. వీటన్నింటికీ బేస్.. మోడలింగ్. అందుకే ఇప్పడు యూత్ మోడలింగ్, ఫ్యాషన్, యాక్టింగ్ వైపు చూస్తున్నారు. అందుకే అమ్మాయిలు, అబ్బాయిలు అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. కోవిడ్ తర్వాత మళ్లీ హైదరాబాద్ మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈవెంట్స్ జరుగుతున్నాయి.
మిస్టర్ సౌత్ ఇండియా 2021 లాంటి బ్యూటీ పేజెంట్స్ లో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కొందరు ప్యాషన్ గా, మరికొందరు కెరీర్ గా ఈ ఫీల్డ్ ఎంచుకుంటున్నారు. చదువుతున్న స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లు కూడా మోడల్ గా రాణించాలనే ఉద్దేశంతో బ్యూటీ పేజెంట్స్ లో పాల్గొంటున్నారు. డిజైనర్ షోలు, ప్రమోషనల్ ఈవెంట్స్, న్యూ ప్రాడక్ట్ లాంచ్ ఈవెంట్స్, బ్రాండింగ్స్, క్యాలాగ్ ఫోటో షూట్స్ లో తళుక్కుమంటున్నారు మోడల్స్. యూత్ కు ఇప్పుడు మోడలింగ్ ఇండస్ట్రీ హాట్ ఫేవరెట్ గా మారింది. ముంబై, డిల్లీ, కోల్ కతా, బెంగుళూర్ లాంటి నగరాల తర్వాత హైదరాబాద్ లో ఫ్యాషన్ షోలు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కి డిమాండ్ పెరుగుతోంది. అయితే 2020 ఏడాది మొత్తం కరోనా, లాక్ డౌన్ తో గడిచింది. సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత ఈవెంట్స్, ప్రమోషన్స్ స్టార్ట్ అవడంతో మోడలింగ్ రంగం సందడిగా మారింది.
ఫ్యాషన్, మార్కెటింగ్ బ్రాండ్ ప్రమోషన్స్ .. సినిమా ఇండస్ట్రీలో మోడల్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. కాన్ఫిడెన్స్, ఫిట్ నెస్ ఉంటే.. మోడల్ గా మంచి గుర్తింపు పొందంటున్నారు సిటీ అమ్మాయిలు. గతంలో కంటే ఇప్పుడు పేరెంట్స్ ఆలోచానా విధానం మారడటంతో యంగ్ స్టర్స్ మోడలింగ్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పిల్లలను నచ్చిన రంగంలో పేరు తెచ్చుకోవాలని పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు అప్ కమింగ్.
సోషల్ మీడియాతో పాటు... మారుతున్న జనరేషన్స్ లో ప్రమోషన్లకు మోడల్స్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ లాంటి సోషల్ మీడియాలోనూ మోడల్స్, ఇన్ ఫ్లుయెన్సర్లకు క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు మోడల్స్, షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మోడల్స్ కు మంచి ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసేందుకు అందాల పోటీలను నిర్వహిస్తున్నాయి మోడలింగ్ ఏజెన్సీలు.
ట్రెడ్రీష్నల్ ఉద్యోగాలు చేసే కంటే.. సొంతంగా సంపాదించడంతో పాటు.. నలుగురిలో సెలెబ్రెటీ స్టేటస్ తెచ్చుకోడానికి ఫ్యాషన్ ఫీల్డ్ ను ఎంచుకుంటున్నారు. పెరుగుతున్న కాంపిటేటీవ్ వరల్డ్ లో నచ్చింది చేయాలి అందులో సక్సెస్ సాధించాలే పట్టుదల ఇప్పటి జనరేషన్ బలంగా నమ్ముతోంది. అందుకు తగ్గట్టుగా క్రియేటివ్ ఫీల్డ్స్ లో రాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
