ఆనంద్‌‌ హ్యాట్రిక్‌‌ ఓటమి

ఆనంద్‌‌ హ్యాట్రిక్‌‌ ఓటమి

అజర్‌‌బైజన్‌‌:  ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌, మాజీ వరల్డ్‌‌ చాంపియన్‌‌ విశ్వనాథ్‌‌ ఆనంద్‌‌.. వుగర్‌‌ గషీమొవ్‌‌  మెమోరియల్‌‌ చెస్‌‌ టోర్నమెంట్‌‌లో వరుసగా ఫెయిలవుతున్నాడు. శనివారం జరిగిన ఫస్ట్‌‌ రౌండ్‌‌లో ఓడిన ఆనంద్‌‌.. ఆదివారం జరిగిన రెండు, మూడు రౌండ్‌‌ పోటీల్లోనూ విఫలమై హ్యాట్రిక్‌‌ ఓటములు మూటగట్టుకున్నాడు. సెకండ్‌‌ రౌండ్‌‌లో రిచర్డ్‌‌ రాపోర్ట్‌‌(హంగేరి) చేతిలో ఓడిన విషీ.. థర్డ్‌‌ రౌండ్‌‌లో డేవిడ్‌‌ నవార(చెక్‌‌ రిపబ్లిక్‌‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ రెండు రౌండ్లను ఆనంద్‌‌ 0.5–1.5 తేడాతోనే కోల్పోయాడు. సోమవారం జరిగే ఫోర్త్‌‌ రౌండ్‌‌లో సెర్గీ కార్జాకిన్‌‌తో ఆనంద్‌‌ తలపడనున్నాడు.

మరిన్ని వార్తలు