Will Pucovski: బంతిని తలకు గురిపెడుతున్న బౌలర్లు.. ఎదుర్కోలేక ఆసీస్ బ్యాటర్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్‌స్కీ దురదృష్టవశాత్తు  తన క్రికెట్ కెరీర్ ను ముగించాల్సి వచ్చిందని సమాచారం. వైద్య కారణాల వలన ఈ ఆసీస్ యువ క్రికెటర్ అకస్మాత్తుగా కెరీర్ ముగిసిందని.. అతను క్రికెట్ కు రిటైర్మెంట్ దూరం కానున్నడని అతని వైద్య బృందం తెలిపింది. శారీరకంగా పుకోవ్‌స్కీ మార్చి 2024 నుంచి వరుసగా గాయలవుతున్నాయి. ముఖ్యంగా తలకు గాయాలవడం అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. 

ALSO READ | Karun Nair: భారత జట్టులో మళ్ళీ స్థానం సంపాదిస్తా.. ట్రిపుల్ సెంచరీ వీరుడి ధీమా

హోబర్ట్‌లో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో విక్టోరియా తరపున టాస్మానియాతో చివరిసారిగా ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరెడిత్ వేసిన బౌన్సర్ కు బంతి అతని హెల్మెట్‌ కు తగలడంతో తీవ్ర గాయమైంది. 21 ఏళ్ళ వయసులోనే పుకోవ్‌స్కీ ఆస్ట్రేలియా టెస్ట్ స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ పై సిడ్నీలో ఏకైక అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 62.. రెండో ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు.