కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో.. ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోం : ఆది శ్రీనివాస్

  • జైలుకు పోతాననే భయం కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నది: ఆది శ్రీనివాస్ 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ– కార్ రేసు కేసులో జైలుకు పోతాననే భయం కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నదని, తన అనుచరుల భూ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే ఆయనకు వణుకు పుడుతున్నదన్నారు. కబ్జా చేసిన స్థలంలో సిరిసిల్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ భవన్ నిర్మించారని ఆరోపించారు.

 ప్రభుత్వ భూములను తిరిగి ఇవ్వడానికి కొందరు ప్రయత్నిస్తుంటే ఎందుకంత అసహనమని ప్రశ్నించారు. కేటీఆర్ అనుచరులు రూ.కోట్లు విలువ చేసే సుమారు వెయ్యి ఎకరాలను అక్రమించుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే నాలుగో వంతు భూములను స్వాధీనం చేసుకుందన్నారు. సిరిసిల్లలోనే ఇంత భూమి కబ్జాకు గురైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకెంత భూమి కబ్జా చేశారో అర్థం చేసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి సినీ తారలు, జడ్జిలతో పాటు వేములవాడలో తన మాటలు కూడా విన్నారని ఆయన ధ్వజమెత్తారు. 

సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అందరి పేర్లు రాసుకుంటున్నానని, కార్యకర్తలు కూడా రాసిపెట్టుకోవాలని కేటీఆర్ అంటున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమన్నారు. అర్హులైన వారికి రైతు భరోసా ఇస్తున్నామని, అసెంబ్లీలో చర్చించి విధివిధానాలను ఖరారు చేశామని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, సంగీతం శ్రీనివాస్, చందన తదితరులు పాల్గొన్నారు.