వాతావరణ శాఖ హెచ్చరిక: ఏపీ లో ఐదు రోజులు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

ఇన్నాళ్ల పాటు మండే ఎండలతో అల్లాడిన జనాలకు జూన్‌ నెల ఆరంభం నుంచే కాస్త ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ ఆరంభం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. జూన్​ 7నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​లో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 ఈ ఏడాది(2024)  నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్​ లో ఐదు రోజులు ( జూన్​ 7 నుంచి)  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈమేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

ఆంధ్రపదేశ్ లోని కొన్ని జిల్లాల్లో జూన్​ 7 నుంచి ఐదు రోజుల  ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది

నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం  దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో  మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటి ప్రభావంతోజూన్​ 7 నుంచి ఐదు రోజుల పాటు , కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

నైరుతి రుతుపవనాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వ్యాపించాయి.  ఈ క్రమంలో ప్రస్తుతం తమిళనాడు దగ్గర బంగాళఖాతంలో తుఫాను తరహా వాతావరణం ఉందనీ.. అలాగే ఏపీ పక్కన కూడా తుపాను తరహా వాతావరణం ఉందని.. వీటి వల్ల.. రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిన వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. .. రాయలసీమ, కోస్తాంధ్రలో పిడుగులు పడటమే కాక.. తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుందనీ, గాలి వేగం గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్లు ఉంటుందనివాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్​7 నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​లోజోరు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది రైతన్నలకు కాస్త ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు. గతేడాది వర్షాలు అంతంతమాత్రమే కురవడంతో.. రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.  ఇక ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో.. అన్నదాతలు వ్యవసాయం పనులు ప్రారంభించారు.