విమానాలను తలదన్నే రీతిలో ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా రూపొందించిన విస్తా డోమ్ కోచ్ లతో ముంబై-పుణే మధ్య ప్రత్యేక రైలు ఈనె 26న ప్రారంభం కానుంది. డెక్కన్ ఎక్స్ ప్రెస్ రుతో నడిచే ఈ స్పెషల్ రైలు ముంబై-పుణే-ముంబై మధ్య నడుస్తుంది. పశ్చిమ ఘాట్ లలోని అందాలను తిలకిస్తూ రైలు ప్రయాణం మరింత మధురమైన గుర్తుగా మిగిలిపోతుందని రైల్వేశాఖ భావిస్తోంది. దేశంలోనే తొలిసారిగా విస్తాడోమ్ కోచ్ లతో డెక్కన్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న విషయాన్ని రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం విస్తాడోమ్ కోచ్ ఫోటోలతో ట్వీట్ చేశారు.
