కరెంట్​ ఏఈని అంటూ మీటర్ల కోసం వసూళ్లు

  • పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు  

శివ్వంపేట, వెలుగు:  కరెంట్​ ఏఈని  అని, కరెంటు మీటర్లు ఇప్పిస్తానని ఒక్క మీటర్ కు రూ.250 వసూలు చేస్తున్న నకిలీ ఏఈని గ్రామస్తులు బంధించి పోలీసులకు అప్పగించారు. శివ్వంపేట మండలంలోని లింగోజిగూడలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.  సామ్య తండాకు చెందిన సురేశ్​  నాయక్  బుధవారం లింగోజీ గూడ తండాకు వెళ్లి  గ్రామంలో డబ్బులు వసూలు చేశాడు.

గ్రామస్తులు అనుమానం రావడంతో  కరెంటు లైన్ మెన్ కు ఫోన్ చేశారు. అతను  ఇచ్చిన సమాచారంతో వచ్చిన వ్యక్తి నకిలీ ఏఈ అని గుర్తించారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.