పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ప్రతి ఎకరానికి సాగునీరిస్తాం: ఉత్తమ్

  • ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం 
  • రికార్డు స్థాయిలో  1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినయ్​
  • డిసెంబర్ 4న పెద్దపల్లిలో లక్ష మందితో బహిరంగ సభ
  • ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి 

పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం ఉమ్మడి జిల్లా ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ పనులు, కాళేశ్వరం 9వ ప్యాకేజీ, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్, రామగుండం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజ్ 2 పనులపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ సందర్భంగా వడ్ల కొనుగోళ్లపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సప్లై కమిషనర్ డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహన్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్​ టన్నుల వడ్లు పండినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. సన్న రకం వడ్లకు రూ.2800 కంటే తక్కువ ధరకు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దళారులకు అమ్మకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ధాన్యం సేకరణ సంతృప్తికరంగా ఉందన్నారు. ఈనెల 4న పెద్దపల్లిలో లక్ష మందితో విజయోత్సవ సభ నిర్వహించనున్నామని, సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

 సీఎం పర్యటనకు ముందే వడ్ల డబ్బులు ఒక్క రూపాయి బాకీ లేకుండా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సప్లై చేస్తామని, ఇందుకు 36 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని సూచించారు.  తక్కువ ఖర్చుతో రైతులకు సాగు నీరు అందించే పనులు ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. 

 సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటూ, కాస్ట్ బెనిఫిట్ నిష్పత్తి సానుకూలంగా ఉన్న పనులను సంబంధిత ఎమ్మెల్యేలతో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అనంతరం  సీఎం డిసెంబర్ 4న పాల్గొననున్న యువ శక్తి సభా స్థలిని మంత్రులు పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్ ఠాకూర్,  కవ్వంపల్లి సత్యనారాయణ,  ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, బి.సత్య ప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు వేణు, అరుణ శ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

సన్న వడ్లకు బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రైతులకు లబ్ధి 

సన్న వడ్లకు రూ. 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులకు లాభం కలుగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, రూ.2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలన్నారు. గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. పోతారం ఎత్తిపోతల పథకం, భీం ఘనపూర్ ఎత్తిపోతల పథకం పనుల ప్రతిపాదనలు అందజేయాలని అధికారులకు సూచించారు. 

ముమ్మరంగా వడ్ల సేకరణ 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా, స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరుగుతోందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్, ఇతర అధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెస్ చార్జీల బిల్లులను గ్రీన్ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సరఫరా చేస్తామని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి బండ్ నిర్మాణం చివరి దశలో ఉందని, కాలువల పనులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు.