ఇంటివద్దే పోస్టుమెన్లతో ఆధార్ ఫోన్ నెంబర్ అప్డేట్

ఇంటివద్దే పోస్టుమెన్లతో ఆధార్ ఫోన్ నెంబర్ అప్డేట్

ఆధార్ లో ఫోన్ నెంబర్ల అప్డేట్ సౌకర్యాన్ని మరింత చేరువ చేసింది యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). పోస్టుమెన్ల సహాయంతో ఇంటి వద్దనే ఆధార్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సదుపాయం మంగళవారం నుండే ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లక్షా 46 వేల మంది పోస్టుమెన్లు, గ్రామీణ డాక్ సేవక్ ల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ తోపాటు అనేక బ్యాంకింగ్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే అనేక ప్రభుత్వ సంక్షేమ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ గార్గ్ వెల్లడించారు. 
ప్రతి వ్యక్తికీ ఆధార్ నెంబర్ తప్పనిసరి అయిపోయిన రోజుల్లో ఇప్పుడు ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని మధ్య తరగతి మానవుడి ఇళ్లలో ఒకటికి మించిన ఫోన్ నెంబర్లు ఉంటున్నాయి. మధ్యతరగతి వారి ఇళ్లలో అయితే భార్యా భర్తలే కాదు.. పిల్లలిద్దరికీ కూడా వేర్వేరు ఫోన్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో చాలా మంది ఎవరి ఆధార్ నెంబర్లలో వారి మొబైల్ ఫోన్లను అప్డేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అనేక కేంద్రాల వద్దీ రద్దీ ఏర్పడుతున్న నేపధ్యంలో ఐఐడీఏఐ పోస్టుమెన్ల తో ఇళ్ల వద్దరే చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించడం సామాన్యులకు ఎంతో ఊరట కలిగిస్తోంది.