నిజాంపేట, వెలుగు : నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామానికి చెందిన ఇద్దరు ముస్లిం బాలికలు ఆదివారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు గ్రామంలో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి స్పందించి సదరు బాలికల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఉన్నట్టు గుర్తిం చారు. అక్కడికి వెళ్లి వారిని తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు గంటల వ్యవధిలోనే మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులను పలువురు అభినందించారు.