నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ 2024 కోసం TRAI బ్లూప్రింట్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో పటిష్టమైన ప్రసార వ్యవస్థను స్థాపించడానికి  నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ 2024 రూపకల్పన కోసం బ్లూప్రింట్ విడుదల చేసింది. టెలివిజన్ రంగంలో భారత్ ను లీడర్ గా చేయడానికి  ఈ గైడ్ లైన్స్  తయారు చేశారు. రీసెర్చ అండ్ డెవలప్ మెంట్, సాంకేతిక ఆవిష్కరణలు, స్వదేశీ తయారీని ప్రోత్సహించే టెక్నాలజీ,  మౌలిక సదుపాయాలను పెంచడానికి ఈ నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ 2024 రూపొందించారు. అందరికీ ప్రసార సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.    

టెలివిజన్ ఛానెళ్ల కోసం భారతదేశాన్ని 'అప్లింకింగ్ హబ్'గా ఉంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ విధానం టెలివిజన్, రేడియో, OTT ప్రసార సేవల కోసం నాణ్యమైన కంటెంట్ ఉత్పత్తి మరియు పంపిణీకి ఇది ప్రోత్సహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కంటెంట్ వ్యాప్తిచేస్తోంది. జూలై 2023లో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ పాలసీని రూపొందించడానికి TRAI చట్టం, 1997లోని సెక్షన్ 11 కింద ఇన్‌పుట్‌లను అందించాలని TRAIని అభ్యర్థించింది.