ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రాజీనామా చేశారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేని పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామాతో.. ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే.. సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తాజాగా ఉప ఎన్నికలు జరపలేని పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం కనిపిస్తోంది. దీంతో రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన తో తీరత్ సింగ్ పదవి నుంచి వైదొలిగారు.
