ఆంధ్ర–ఒడిశా (AOB)సరిహద్దు ప్రాంతం మల్కన్ గిరి జిల్లా తులసి పహాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఒరిస్సా డీజీపీ తెలిపారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరను పేల్చడంతో పోలీసులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత వెంటనే అలర్టైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్ లు మృతిచెందినట్లు డీజీపీ ప్రకటించారు. మృతి చెందిన మావోయిస్టు AOB ఎస్ జెడ్ సీ మల్కన్ గిరి - కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యులు గా ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. SOG జవాన్‌కు గాయాలు కావడంతో హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు.
