- ఫుడ్ డెలివరీపై 5శాతం జీఎస్టీ
- ఫుట్‌వేర్‌పై ఇక నుంచి 12 % జీఎస్టీ
కొత్త ఏడాదిలో కొన్ని వస్తువులు, సేవలకు మరింత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక నుంచి ఫుడ్‌డెలివరీపై ఐదుశాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఫుట్‌వేర్‌పై జీఎస్టీని ఐదుశాతం నుంచి 12 శాతానికి పెంచారు. క్యాబ్ బుక్ చేసుకున్నా ఐదు శాతం జీఎస్టీ కట్టాలి. ఈ కొత్త రూల్స్ శనివారం నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ సంస్థలు ఇక నుంచి ఐదుశాతం ఎక్కువ వసూలు చేస్తాయి. ప్రస్తుతం రెస్టారెంట్లే జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి కడుతున్నాయి. ఉబర్, ఓలా వంటి క్యాబ్ అగ్రిగేటర్లు టూ, త్రీవీలర్ల బుకింగ్స్‌కు ఐదుశాతం జీఎస్టీ వసూలు చేస్తాయి. అన్ని రకాల ఫుట్‌వేర్‌పై ఇక నుంచి ఐదు శాతానికి బదులు 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి జీఎస్టీ చట్టంలో కొన్ని మార్పులను అమలు చేస్తున్నారు. ఇక నుంచి పర్చేజ్ రిటర్న్‌లో క్రెడిట్ కనిపిస్తేనే ఇన్పుట్ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి వీలుంటుంది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ట్యాక్స్బకాయిలను వసూలు చేయడానికి ఆఫీసర్లకు సంబంధిత సంస్థ ఆఫీసుకు వెళ్లడానికి అధికారాలు ఉంటాయి.
