మార్చి 27న ఆట మొదలవుతుంది

మార్చి 27న ఆట మొదలవుతుంది

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో పాటు.. బీజేపీ ముఖ్య నాయకులు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి సారించారు. దీనిపై స్పందించిన మమతా.. బీజేపీ పెద్దలను దుర్యోధనులు, దుశ్శాసనులతో పోల్చారు. అంతేకాదు..మాకు అల్లర్లు వద్దు, లూటీలకు పాల్పడేవాళ్లు, దుర్యోధనులు, దుశ్శాసనులు, మీర్ జాఫర్‌ను మేం కోరుకోవడంలేదన్నారు. మార్చి 27న ఆట మొదలవుతుందని.. బీజేపీ బౌల్డ్ కావడం ఖాయమని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.