దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలు

మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వందే మెట్రో రైలు పూర్తి అన్​ రిజర్వడ్​ ఎయిర్​ కండిషన్​తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది ప్రయాణికులు నిల్చుని ప్రయాణించవచ్చు. దేశంలోనే తొలిసారిగా గుజరాత్​లోని అహ్మదాబాద్​ – భుజ్​ల మధ్య గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో 334 కిలో మీటర్ల మేరకు మెట్రో రైలు ప్రయాణించింది. 

    వందే భారత్​ మెట్రో రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో అహ్మదాబాద్​, భుజ్​ మధ్య 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోనున్నది. 
    వందే భారత్​ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్​లు, కవచ్​ వంటి భద్రతా సౌకర్యాలతోపాటు సెమీ హైస్పీడ్​ రైలుగా దీన్ని రూపొందించారు. మెట్రో రైలులా ఆటోమేటిక్​ డోర్లు దీనిలో ఉంటాయి.