ఆర్టిజన్​ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

అచ్చంపేట , వెలుగు: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ కార్మికులను   ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని, కాంగ్రెస్​ ప్రభుత్వం అయినా కార్మికులను రెగ్యులర్ చేయాలని టీజీ ఎస్పీ డీసీఎల్​ జేఏసీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. అచ్చంపేట మండలంలోనిహాజీపూర్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్  కార్మికుల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీని ఏర్పాటు చేశారు. 

రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఆర్టీజెన్స్ స్పాట్ బిల్లింగ్​ ఎస్ పీఎం కార్మికులు నాలుగు, ఐదు సార్లు ప్రభుత్వానికి కోరామని, అసెంబ్లీలో లీడర్లు కార్మికుల పట్ల సానుకూలంగా చర్చించినా.. ఫలితం లేదన్నారు. వెంటనే ఆర్టిజన్సు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులను విస్మరిస్తే .. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో గౌరవధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనయ్య, కోశాధికారి వెంకట్రాం నాయక్, తదితరులున్నారు.