జిల్లా నార్కోటిక్ బ్రాంచ్ ద్వారా మంచి ఫలితాలు

సంగారెడ్డి టౌన్, వెలుగు:  వార్షిక తనిఖీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీ  అభిలాష  బిస్త్ బుధవారం సంగారెడ్డి లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీలు  నిర్వహించారు.  ఎస్పీ రూపేష్  డీజీకి స్వాగతం పలికారు . అనంతరం   అధికారులతో డీజీ  సమావేశం నిర్వహించారు.   కొత్తగా కానిస్టేబుళ్లు విధుల్లో చేరడంతో  సిబ్బంది కొరత తీరిందని, మహిళ సిబ్బంది అన్ని రకాల విధులను నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.  

ప్రతి ఒక్కరూ నిబద్ధతతో తమకు కేటాయించిన విధులను  నిర్వహించాలని  చెప్పారు.   మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడం ,అదుపు చేయడంలో సంగారెడ్డి నార్కోటిక్స్​ అనాలసిస్ బ్రాంచ్ మంచి ఫలితాలను సాధిస్తుందని అభినందించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్లో సిబ్బంది పరేడ్ ,టర్న్ అవుట్ ,మ్యాబ్రిల్ డ్రిల్ తనిఖీ చేశారు. 

 డీజీ వెంట మల్టీజోన్ 2 ఐజి సత్యనారాయణ, అదనపు ఎస్పీ సంజీవరావు ,డిటిసి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కళ్యాణి ,డి. ఎస్. పిలు సత్తయ్య గౌడ్ ,రవీందర్ రెడ్డి ,రామ్మోహన్ రెడ్డి ,వెంకట్ రెడ్డి ,జిల్లా ఇన్స్పెక్టర్ ,ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.