చెన్నై: తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండ టంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో వరద నీళ్లలో కరెంట్ వైర్లు తెగిపడటంతో కరెంట్ షాకుతో ముగ్గురు మృతి చెందారు. ఇక చెన్నై సిటీలోనూ గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 18 సెంటీమీటర్ల వాన పడింది. చాలా కాలనీలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచి పోయింది. 3 గంటల్లోనే ఎమ్మార్సీ నగర్లో 18, నుంగంబాక్కంలో 12, నందనంలో 8 సెంటీమీటర్ల వాన పడింది. రాష్ట్ర సెక్రటేరియట్లోని ఆఫీస్ రూంలలోకి వరద నీరు చేరిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
