ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ లో రైతుల పైకి కారుతో దూసుకుపోయిన కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూపీ పోలీసులు స్పందించారు.
రైతుల మృతికి కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు ఎట్టకేలకు పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. లఖింపూర్ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని లక్నో ఐజీ లక్ష్మీ సింగ్ తెలిపారు. ప్రస్తుతానికి ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నట్లు చెప్పారు.
