మేం 10 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగాలిచ్చాం : శ్రీధర్ బాబు

పాలమూరులో రెండు ఏటీసీ(అడ్వాన్స్ డ్ టెక్నికల్ సెంటర్లు)  సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలోని ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేశారు శ్రీధర్ బాబు.  సందర్బంగా మాట్లాడిన ఆయన..  పాలమూరులో స్కిల్ యూనివర్సిటీ విభాగం ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తామన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

గత బీఆర్ఎస్  ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను కూడా నియమించలేదని విమర్శించారు శ్రీధర్ బాబు.బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.  గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టిన బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు..  గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయన్నారు. ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టిందన్నారు శ్రీధర్ బాబు. 

ALSO READ | వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి

 యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశ్రమలను  అనుసంధానం చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు శ్రీధర్ బాబు.  టాటా టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.   33 కోర్సులను ప్రక్షాళన చేసి విద్యార్థులకు అందిస్తామన్నారు శ్రీధర్ బాబు.  బీఏ, బీకాం చదివే విద్యార్థులకు బ్యాంకింగ్ , పైనాన్షియల్ కోర్సులను జోడించి నైపుణ్యం కల్పిస్తామన్నారు.  విద్యార్థుల పరిశోధనలకు తోడ్పాటు అందిస్తామని చెప్పారు.   విద్యార్థుల భవిష్యత్తుకు తమది బాధ్యత అని చెప్పారు. పాలమూరు జిల్లా సీఎం జిల్లా అని.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు శ్రీధర్ బాబు.