సంగారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 282 మందిపై కేసు

సంగారెడ్డి టౌన్, వెలుగు: న్యూ ఇయర్​ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ 282 మంది పట్టుబడినట్లు ఎస్పీ రూపేశ్​ తెలిపారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్  నిబంధనలను పాటించి సహకరించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి సమాచారాన్ని జిల్లా నార్కోటిక్  ఎనాలసిస్  బ్రాంచ్ 8712656777కు అందించాలని కోరారు.

సిద్దిపేటలో 89 కేసులు..

సిద్దిపేట రూరల్: సిద్దిపేట కమిషనరేట్  పరిధిలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్  అండ్  డ్రైవ్  స్పెషల్  డ్రైవ్ లో 89 కేసులు నమోదు చేసినట్లు సీపీ బి. అనురాధ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 31న రాత్రి  12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు వాహనాల తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. తనిఖీల్లో ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీశ్, సుమన్ కుమార్  పాల్గొన్నారు.