డ్రగ్స్ నుంచి యువతను కాపాడుకుందాం : ఎస్పీ జానకి

పాలమూరు, వెలుగు: డ్రగ్స్ నుంచి యువతను కాపాడుకుందామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ  జానకి పిలుపునిచ్చారు. జిల్లాలోని పోలీసు అధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి కాలేజీలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలపై పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 59360 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, జి.వి.రమణా రెడ్డి, ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్  తదితరులు పాల్గొన్నారు.