Ravichandran Ashwin: ఫైనల్‌కు అడుగు దూరంలో: పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

పాకిస్థాన్ తో సొంతగడ్డపై సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ జట్టును ప్రకటించగా..తాజాగా గురువారం (డిసెంబర్ 19) సౌతాఫ్రికా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టెంబా బవుమా సఫారీ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్‌లకు జట్టులో చోటు దక్కింది.   
 
పార్ల్‌లో మంగళవారం (డిసెంబర్ 17) జరిగిన మొదటి వన్డేలో మహారాజ్ గజ్జల్లో గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో టాస్ కు ముందు అతన్ని తుది జట్టు నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈ వారం చివరిలో అతను స్కానింగ్ చేయించుకోనున్నాడు. టెస్ట్ సిరీస్ కు ఒకవేళ మహరాజ్ దూరమైతే సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. ఫాస్ట్ బౌలర్లు రబడ, జాన్సెన్ ఇద్దరూ ప్రస్తుతం ఫిట్‌గా ఉండడం ఊరట కలిగిస్తుంది. అయితే గాయాలతో లుంగీ ఎన్‌గిడి, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్ దూరమయ్యారు. 

ALSO READ : IND vs AUS 3rd Test: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. అశ్విన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు స్పెషల్ గిఫ్ట్

సౌతాఫ్రికా సౌతాఫ్రికా  ప్రస్తుతం సౌతాఫ్రికా 63.33  పీటీసీతో టాప్ ప్లేస్‌‌కు చేరుకోగా..ఆస్ట్రేలియా 60.71 పీటీసీతో  రెండో స్థానానికి పరిమితమైంది. ఇండియా (57.29) ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. రెండు టెస్టుల్లో ఒక్క టెస్ట్ గెలిచినా సౌతాఫ్రికా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడనుంది. సొంతగడ్డపై ఆడనుండడం సౌతాఫ్రికాపై ఇది మంచి అవకాశం. 

పాకిస్థాన్‌తో టెస్టుల సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు

టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్‌జ్‌కే, టోనీ డి జోర్జి, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడా, కెయ్‌స్టాన్ రికెల్బ్స్ వెర్రేన్నే