సిద్దిపేటలో చైనా మాంజా సీజ్ చేసిన పోలీసులు

సిద్దిపేట రూరల్, వెలుగు: రూ.1,19,700 విలువగల 267 చైనా మాంజా బండల్స్ ను సీజ్​చేసినట్లు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. సిద్దిపేట టూ టౌన్ పీఎస్​పరిధిలోని పారుపల్లి వీధిలో బాలాజీ బుక్ డిపోను నడిపే పెద్ది మురళి పాత ఇంట్లో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. 

సిబ్బందితో వెళ్లి, తనిఖీలు చేసి చైనా మాంజా బండల్స్ ను స్వాధీనం చేసుకుని, టూ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు.