Good News : దసరా, దివాళీకి సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు ఇవే.

దసరా, దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండగల సమయంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టింది. 48 ప్రత్యేక రైళ్లను నడపాలని  నిర్ణయించింది. దీంతో రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంది.

Also Read :- చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

ప్రత్యేక రైళ్లు ఇవే..

  • కాచిగూడ- తిరుపతి (07653) రైలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుంది
  • తిరుపతి - కాచిగూడ (07654) అక్టోబర్ 11  నుంచి నవంబర్ 15  వరకు
  • సికింద్రాబాద్ - నాగర్సోల్ (07517) అక్టోబర్ 9  నవంబర్ 6 వరకు
  • నాగర్‌సోల్ - సికింద్రాబాద్ (07518) సర్వీస్ అక్టోబర్ 10  నవంబర్ 7 
  • కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07122) అక్టోబర్ 7 నవంబర్ 4 
  • సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ (07188) అక్టోబర్ 8 నవంబర్ 5 వరకు