ఎంపీల సస్పెన్షన్ రగడ.. రాజ్యసభ రేపటికి వాయిదా

ఎంపీల సస్పెన్షన్ రగడ.. రాజ్యసభ రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.  12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్  వ్యవహారంతో సమావేశాలు  హాట్ టాపిక్ గా మారాయి.  గత పార్లమెంట్ సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు ఈ శీతాకాల సమావేశాల నుంచి మొత్తంగా సస్పెండ్ చేస్తూ  రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ 12 మంది ఎంపీలు చేసిన విజ్ఞప్తిని ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడంతో సభనుంచి వాకౌట్ చేశాయి విపక్షాలు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రం ఎదుట ఆదోళనకు దిగాయి.