హైదరాబాద్, వెలుగు: పండుగలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి కొల్లాంకు బయలుదేరి, 21, 22 తేద్లీలో రిటర్న్ కానున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 19న కాచిగూడ – కొల్లాం (07053 నంబర్) ట్రైన్.. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి తదితర స్టేషన్లలో ఆగుతుందని చెప్పింది. 20న 07141 నంబర్ ట్రైన్ సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం, తదితర స్టేషన్ల మీదుగా వెళ్లనుందని తెలిపింది.
