అనుకూలించని వాతావరణం.. మోడీ ప్రసంగం రద్దు

అనుకూలించని వాతావరణం.. మోడీ ప్రసంగం రద్దు

ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని రద్దు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. యూపీలో బిజ్నోర్‌ జన్ చౌపాల్ ర్యాలీలో పాల్గొని ప్రధాని ప్రసంగించాల్సి ఉంది, అయితే వాతావరణ సమస్యల కారణంగా మోడీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. . రెండో విడతలో జరగనున్న మూడు జిల్లాల్లోని 21 నియోజకవర్గాల్లో ఓటర్లు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ బిజ్నోర్‌లో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. అయితే వెదర్ సరిగా లేకపోవడంతో ఇవాళ యూపీ ప్రజల్ని ఉద్దేశించి వర్చువల్ ర్యాలీలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 

పీఎం మోదీ “జన్ చౌపాల్” ర్యాలీకి 1,000 మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ మార్గంలో ర్యాలీని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఈ ర్యాలీ ద్వారా మూడు జిల్లాల 18 అసెంబ్లీలను  బీజేపీ కవర్ చేయాలనుకుంది. అయితే  వాతావరణం సరిగా లేకపోవడంతో ప్రధాని తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. మరోవైపు యూపీలో మొదటి విడత ఎన్నికలు 10న జరగనున్నాయి. మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఫలితాలు మార్చిబి 10న వెల్లడికానున్నాయి.

ఇవి కూడా చదవండి: 

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు