UP ఎన్నికల కోసం అయోధ్య నుంచి MIM ప్రచారం

UP ఎన్నికల కోసం అయోధ్య నుంచి MIM ప్రచారం

ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది(2022) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటి నుంచే పార్టీలు తమ కార్యచరణ రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఎన్నికలకు సంబందించి ముందస్తు సర్వేలు ఫలితాలు విడుదల చేశాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని.. మళ్లీ సీఎంగా యోగీని ఎంచుకునే అవకాశం ఉందని ముందస్తు సర్వేలు తెలిపాయి.

మరోవైపు యూపీలో జరగబోయే ఎన్నికల్లో MIM కూడా బరిలోకి దిగుతోంది. చారిత్రక నగరమైన అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్టు యూపీ ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు. అయోధ్యనగరానికి 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుదౌలీ తహసీల్ లో ఇవాళ (మంగళవారం)మధ్యాహ్నం ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ ప్రచారాన్ని MIM చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ ప్రారంభించనున్నారు.