హైడ్రోజన్‌‌‌‌ బస్సును టెస్ట్‌‌‌‌ చేసిన ‘ఆయిల్‌‌‌‌’

హైడ్రోజన్‌‌‌‌ బస్సును టెస్ట్‌‌‌‌ చేసిన ‘ఆయిల్‌‌‌‌’

న్యూఢిల్లీ: తన స్టార్టప్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ కింద ఓమ్‌‌‌‌ క్లీన్‌‌‌‌టెక్‌‌‌‌ డెవలప్ చేసిన హైడ్రోజన్‌‌‌‌తో నడిచే బస్సును ప్రభుత్వ కంపెనీ ఆయిల్ ఇండియా శనివారం టెస్ట్ చేసింది. ఈ  బస్సు తాజాగా బెటా టెస్ట్‌‌‌‌ పూర్తి చేసుకుందని ఆయిల్ ఇండియా ప్రకటించింది. ‘స్టార్టప్‌‌‌‌ నర్చరింగ్‌‌‌‌, ఎనబులింగ్ అండ్ హ్యాండ్లింగ్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఈహెచ్‌‌‌‌)’ ప్రోగ్రామ్‌‌‌‌ను ఆయిల్‌‌‌‌ ఇండియా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 9 మీటర్ల పొడవుండే ఈ బస్సులో 60 కిలోవాట్స్ పీఈఎం ఫ్యూయల్ సెల్ ఇంజన్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోజన్ బస్సు కనీసం 450 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.