నాగర్ కర్నూల్ జిల్లాలో అక్టోబర్ 27న మాలల ఆత్మగౌరవ సభ

  • సభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు 

కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27 న జరిగే మాలల ఆత్మగౌరవ సభ పోస్టర్ ను గురువారం రాష్ట్ర ఎక్సైజ్ , పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాల సంఘం నాయకులతో  కలిసి కొల్లాపూర్ లోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాలల ఆత్మగౌరవ సభ జిల్లా కన్వీనర్ డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ..  ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ జరిగే మాలల ఆత్మగౌరవ సభకు మాలలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.సంఘం నాయకులు డాక్టర్ కే శంకరయ్య, మాల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాసు, సంఘం నాయకులు పాల్గొన్నారు. 

దర్గాను దర్శించుకున్న మంత్రి జూపల్లి 

పానుగల్, వెలుగు: పానుగల్ మండల కేంద్రంలోని మహేబూబ్ సుభాహని దర్గాను ఎక్సైజ్ , పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం దర్శించుకున్నారు. బాలపీర్ల దగ్గర మౌలిక వసతుల కల్పనకు రూ. కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.