నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ ఎగ్జామినేషన్ కోసం నాలుగో విడుత అడ్మిషన్ కార్డును విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వారి అడ్మిట్ కార్డులను తన అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది. ఐఐటీ,ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ను ఈ ఏడాది నుంచి నాలుగు విడుతలుగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 7 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 26, 27, 31 తేదీల్లో అలాగే వచ్చేనెల 1, 2 తేదీల్లో ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వెబ్ సైట్ లో ఉంచిన తమ అడ్మిట్ కార్డులను విద్యార్థులు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కొన్ని సులభమైన సూచనలను అనుసరించడం ద్వారా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ని సందర్శించడం ద్వారా అడ్మిషన్ కార్డును (JEE మెయిన్ 2021 అడ్మిషన్ కార్డ్) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
