- 70శాతం విద్యార్థులకు ఫ్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ సంస్ధలలో తమ విద్యార్థులకు 70శాతం మందికి పైగా ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు వచ్చాయని నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) ప్రకటించింది. అంతేకాదు 100 శాతం మందికి ప్లేస్ మెంట్స్ వచ్చాయని, అత్యధిక సీటీసీ సంవత్సరానికి 25 లక్షల రూపాయలుగా నమోదయిందని నిట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. టీసీఎస్, కోకాకోలా సహా సుప్రసిద్ధ సంస్థలెన్నో పాల్గొన్న ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో దాదాపు 700కు పైగా ప్లేస్‌మెంట్స్ జరిగాయి. నిట్ కరిక్యులమ్ లాభాపేక్ష లేని విధానంతో విద్యార్థులు విజయవంతమైన కెరీర్‌ను మలచుకునే రీతిలో తీర్చిదిద్దుతున్నామని నిట్ తెలిపింది.
ఇటీవలనే ఈ యూనివర్శిటీ తమ నాలుగు సంవత్సరాల బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ), 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ మార్కెటిగ్ ఎనలిటిక్స్, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్, ఫైనాన్స్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్, బిజినెస్ ఎనలిటిక్స్, కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్, డిజిటల్, సోషల్ మీడియా మార్కెటింగ్) మరియు మూడు సంవత్సరాల బీబీఏ (ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ ఎనలిటిక్స్, ఫ్యామిలీ మేనేజ్డ్ బిజినెస్)లో దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ ప్రోగ్రామ్‌లలో దరఖాస్తు చేసేందుకు www.niituniversity.in చూడవచ్చు
