అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు అరెస్ట్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు అరెస్ట్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులను అరెస్టు చేసింది ఎన్ఐఏ. దావూద్ గ్యాంగ్ లోని నాయకుడు చోటా షకీల్ అనుచరులు... ఆరీఫ్ అబుబకర్ షేక్, షబ్బీర్ అబూ బకర్ షేక్ లను అరెస్టు చేశారు అధికారులు. ఇవాళ ఎన్ఐఏ కోర్టు ఎదుట వీరిని ప్రవేశపెట్టనున్నారు. వీరిద్దరూ వెస్ట్ ముంబై లోని డీ- కంపెనీకి చెందిన అసాంఘిక కార్యకలాపాలు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయడం వంటి పనుల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సిండికేట్ లో మొత్తం 21 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

దావూద్ డీ- కంపెనీ హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ ఏడాది ఫిబ్రవరి 3న కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ఉగ్రకార్యకలాపాల ద్వారా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. దీంతో..ఈనెల 9న ముంబైలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దావూద్ కంపెనీకి చేందిన హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.