గ్రేటర్​కు న్యూలుక్​.. స్మార్ట్​ సిటీ ప్రాజెక్టులో తళుక్కుమంటున్న జంక్షన్స్​

  • సరికొత్త థీమ్స్​తో ఆకట్టుకుంటున్న వరంగల్​సిటీ ప్రధాన కూడళ్లు
  • రూ.3.20 కోట్లతో 10 జంక్షన్ల సుందరీకరణ 

.వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ జంక్షన్లు న్యూ లుక్​తో ఆకట్టుకుంటున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలోని దాదాపు 20 కిలోమీటర్ల నగరంలో స్మార్ట్​సిటీ రెండో ఫేజ్​లో 11 జంక్షన్లను ఏడాదిగా ముస్తాబు చేయగా, పనులు పూర్తయిన 10 జంక్షన్లను మంత్రి కొండా సురేఖ, వరంగల్‍ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు ఆయా ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ పనుల కోసం రూ.3 కోట్ల 19 లక్షల 50 వేల స్మార్ట్​సిటీ ఫండ్స్​ఖర్చు చేశారు.

ఎస్‍ఎన్‍ఎం క్లబ్‍ జంక్షల్లో చేతి చిహ్నం.. 

వరంగల్‍ తూర్పు నియోజకవర్గం రైల్వే స్టేషన్‍, బస్టాండ్‍ అడ్డాగా ఉండే ఎస్‍ఎన్‍ఎం క్లబ్‍ జంక్షన్‍ అభివృద్ధికి రూ.57 లక్షల 52 వేలు ఖర్చు చేశారు. జంక్షన్‍ మధ్యలో త్యాగధనుల పోరాటాలకు గుర్తుగా ఆకాశం వైపు చూస్తున్న దాదాపు 10 నుంచి 12 ఫీట్ల ఎత్తులో ఉండే చేతి చిహ్నం, చుట్టూరా ఫౌంటేన్‍ ఏర్పాటు చేశారు. చేతి మణికట్టు వద్ద కాకతీయ కళాతోరణాలు, పోరాటయోధులను గుర్తుచేసేలా జంక్షన్‍ ఉంది.  

బాలాజీ నగర్‍ జంక్షన్​లో షవర్‍..  

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్‍ బాలాజీ నగర్‍ జంక్షన్‍ వెడల్పుతోపాటు షవర్‍ ఫౌంటేన్‍ రాత్రిళ్లు ఈ ప్రాంతాన్ని ఎక్కడో ఖరీదైన సిటీలో ఉండేలా మార్చారు. దీని డెవలప్‍మెంట్‍ కోసం రూ.67.44 లక్షలు ఖర్చు చేశారు. పైనా డబ్బా ఆకారం నుంచి షవర్‍ నీరు పడుతుండగా, చుట్టూరా గ్రిల్స్​ను ఆనుకుని మరో రింగుగా ఫౌంటేన్‍ ఏర్పాటు చేశారు. 

నాయుడు పెట్రోల్‍ పంప్​జంక్షన్​లో బటర్‍ ఫ్లైస్‍..

వరంగల్‍ సిటీ నుంచి ఖమ్మం వైపు వెళ్లేదారిలో మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​కు కిలోమీటర్ దగ్గర్లో ఉండే నాయుడు పెట్రోల్‍ పంప్‍ జంక్షన్​లో రూ.28.78 లక్షలతో డెవలప్‍ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బటర్​ఫ్లైస్​ ఆకట్టుకుంటున్నాయి.  

టీడీడీ జంక్షన్‍ లో శంఖం.. 

హనుమకొండ టీటీడీ జంక్షన్‍ చుట్టూరా ఉండే ఆలయాలతో ఆధ్మాత్మికతను సంతరించుకుంటుంది. దీంతో ఇక్కడ రూ.31.11 లక్షలతో అభివృద్ధి చేసి గాలిలో ఉన్నట్టు కనిపించే విధంగా శంఖం ఏర్పాటు చేశారు. నీటిని వదులుతున్నట్లుగా ఉండే ఈ ఫౌంటేన్‍ను మిగతావాటికి భిన్నంగా ఉంటుంది. 

అలంకార్‍ జంక్షన్​లో తబలా.. 

హనుమకొండ అలంకార్‍ టాకీస్‍ జంక్షన్‍కు అభివృద్ధికి రూ.4.83 లక్షలు ఖర్చు చేశారు. భారీ తబలాపై కళాకారుణులు సంప్రదాయ శాస్త్రీయ నృత్యం చేస్తున్న భంగిమలు ఆకట్టుకుంటున్నాయి. .

కాజీపేట జంక్షన్‍లో ట్రావెల్లర్స్​ 

కాజీపేట రైల్వే స్టేషన్‍ ముందు చౌరస్తా వేదికగా ఏర్పాటు చేసిన జంక్షన్‍ ను రూ.22.70 లక్షలతో డెవలప్​చేశారు. రైల్వే స్టేషన్‍, పక్కనే బస్‍ స్టాప్‍తో వివిధ ప్రాంతాలకు వెళ్లే జంక్షన్‍ కావడంతో సూట్‍కేసులు, బ్యాగులతో ప్రయాణానికి వెళ్తున్న యువ ప్యాసింజర్లు, కుర్చీల్లో సేద తీరుతున్నట్లు పెద్దలు, పిల్లల ప్రతిమలను ఏర్పాటు చేశారు.  

ఫాతిమా జంక్షన్‍ లో చిల్డ్రన్‍ స్పెషల్‍ 

కాజీపేట మీదుగా హైదరాబాద్‍ మార్గంలో ఉండే ఫాతిమా నగర్‍ సెంటర్‍ ఏండ్ల తరబడి మిషనరీ స్కూళ్లు, ఆస్పత్రులతో ఎడ్యుకేషన్‍ సెంటర్‍గా ఉంది. ఈ జంక్షన్​ను రూ.14.56 లక్షలతో చిల్డ్రన్‍ స్పెషల్‍గా డెవలప్‍ చేశారు. చిన్నారులిద్దరిలో ఒకరు చదువుకున్నట్లు, పాప స్కిప్పింగ్‍ ఆడుతున్నట్లు తీర్చిదిద్దారు.   

జవహర్‍ కాలనీ జంక్షన్​లో స్వాన్స్​  

కేయూ వంద ఫీట్ల రోడ్‍ వడ్డెపల్లికి దగ్గర్లోని జవహర్‍ కాలనీ జంక్షన్‍ను రూ.26.58 లక్షలతో డెవలప్ చేశారు. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే స్వాన్స్​​ (పొడవాటి మెడతో తెల్లని హంస) రూపాలతో జంక్షన్‍ కనువిందు చేస్తోంది. 

గోల్డ్​ కలర్​ ఈఫిల్‍ టవర్‍..

వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గం అంబేద్కర్‍ విగ్రహం, ఎల్‍ఐసీ బిల్డింగ్‍ నుంచి బాలసముద్రం వెళ్లే జంక్షన్​ను రూ.19.13 లక్షలతో డెవలప్​చేసి దాదాపు 30 ఫీట్ల ఈఫిల్‍ టవర్‍ ను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో గోల్డ్​ కలర్‍తో ఉన్న టవర్‍ లైటింగ్‍తో జిగేల్​మంటుంది. 

వెంకట్రామ జంక్షన్‍ లో రింగ్‍ ఫౌంటేన్‍..

తూర్పు నియోజకవర్గంలో నగరం నుంచి నర్సంపేట వైపు వెళ్లే వెంకట్రామ థియేటర్‍ జంక్షన్‍ను రూ.46.85 లక్షలతో డెవలప్​చేశారు. ఇక్కడ రింగ్‍ ఆకారంలో వెడల్పుగా విస్తరించారు. రాత్రిళ్లు జిగేల్‍మనే లైటింగ్‍లో ప్యాలెస్‍లో ఉన్నట్లు తెల్లని రంగులో ఫౌంటేన్‍ ఏర్పాటు చేసి ఈ ప్రాంతం కలర్‍ఫుల్‍గా మార్చారు.