29న కమిషనర్​ ఆఫీసు ముట్టడిస్తాం

  • సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి  సత్తయ్య

జడ్చర్ల, వెలుగు:  తమ సమస్యలను  పరిష్కారించాలని కోరుతూ 21  రోజులుగా మున్సిపల్​ కార్మికులు ఆందోళన చేస్తున్నా  ఆఫీసర్లు స్పందించడం లేదు.  ఇందుకు  నిరసనగా ఈనెల 29వ తేదీన జడ్చర్ల మున్సిపల్​ కమిషనర్​ ఆఫీస్​ ను​ ముట్టడించాలని నిర్ణయించినట్లు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య ఆదివారం తెలిపారు. 

 ఈ మేరకు  కావేరమ్మపేటలోని ప్రధాన రహదారిపై కార్మికులతో కలిసి ధర్నా చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఆకుల వెంకటేష్​, కృష్ణ, మహేశ్​​, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.