ముగ్గురు రైల్వే సిబ్బందిపై నుంచి దూసుకెళ్లిన ​ట్రెయిన్

ముగ్గురు రైల్వే సిబ్బందిపై నుంచి దూసుకెళ్లిన ​ట్రెయిన్
  • స్పాట్​లోనే ఎంప్లాయీస్​ మృతి
  • ముంబైలో ఘటన 

ముంబై :  ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ లో తలెత్తిన లోపాన్ని సరిచేస్తున్న ముగ్గురు సిబ్బంది పై నుంచి లోకల్​ట్రెయిన్​దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు ఎంప్లాయీస్​స్పాట్​లోనే చనిపోయారు. పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ రోడ్ –  నైగావ్ స్టేషన్‌‌ల మధ్య సోమవారం రాత్రి 8.55 గంటలకు ఈ సంఘటన జరిగింది.

మృతులను డబ్ల్యూఆర్ ముంబై డివిజన్‌‌లోని సిగ్నలింగ్ విభాగానికి చీఫ్ సిగ్నలింగ్ ఇన్‌‌స్పెక్టర్ వాసు మిత్ర, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్ మెయింటెయినర్ సోమనాథ్ ఉత్తమ్ లంబుత్రే, హెల్పర్ సచిన్ వాంఖడేగా గుర్తించారు. సోమవారం సాయంత్రం వాసాయి టౌన్​దగ్గర్లో సిగ్నలింగ్ సిస్టమ్ లో లోపం తలెత్తింది.

దీంతో ఆ ముగ్గురు స్పాట్​కు చేరుకొని లోపాన్ని సరిచేసే పనిలో నిమగ్నమై ఉండగా.. దక్షిణ ముంబైలోని చర్చ్‌‌గేట్ టెర్మినస్ వైపు వెళ్తున్న లోకల్ ట్రెయిన్​ ఆ ముగ్గురి పైనుంచి దూసుకెళ్లింది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు స్పాట్​కు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కొక్కరి కుటుంబానికి రూ.55వేల చొప్పున చెల్లించారు