గోటూర్ గ్రామాంలో కూలిన మట్టి మిద్దె

ధన్వాడ, వెలుగు: మండలంలోని గోటూర్ గ్రామానికి  చెందిన గౌని రవీందర్ రెడ్డి మట్టి మిద్దె కూలింది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మట్టి మిద్దె కూలిపోయింది.

భార్యాభర్తలు మొహరం ప్రారంభ వేడుకలు చూడడానికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిద్దె కూలడంతో ఇంటిలో ఉన్న వస్తువులతో పాటు ధాన్యం బస్తాలు, వంట సామగ్రి, బట్టలు పనికిరాకుండా పోయాయి. రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.