చేర్యాల ప్రభుత్వస్పత్రిని అప్​గ్రేడ్​ చేయండి : చామల కిరణ్​కుమార్​రెడ్డి

చేర్యాల, వెలుగు: చేర్యాల ప్రభుత్వస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్​గ్రేడ్​ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డికి మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు వినతిపత్రాన్ని అందజేశారు. 

ఆదివారం హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో కలిసిన ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్​పోస్టులు, సిబ్బందిని నియమించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు  కాటం మల్లేశం, రవీందర్​, సురేందర్​ ఉన్నారు.