పెళ్లి పందిరిలో మనీహీస్ట్ దొంగ.. హడలిపోయిన బంధువులు

పెళ్లి పందిరిలో మనీహీస్ట్ దొంగ.. హడలిపోయిన బంధువులు

హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. మెహెందీ, సంగీత్, పెళ్లి బరాత్.. ఇలా చాలా రకాల ఈవెంట్లు ఉంటాయి. బంధుమిత్రులందరినీ పిలిచి.. దేనికి తీసిపోకుండా ఆర్భాటంగా పెళ్లి జరుపుతారు. అప్పగింతల ముందు పెళ్లి కొడుకు చెప్పులు దాచిపెట్టడం.. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.

బావమరుదులు, మరదల్లు.. పెళ్లికొడుకు చెప్పులు దాచిపెడ్తుంటాయి. అయితే, పాకిస్తాన్ లోని ఓ హిందూ కుటుంబంలో జరిగిన పెళ్లిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అదికాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వధువు వార్దా సికందర్ వాళ్ల తమ్ముడు మనీ హీస్ట్ గెటప్ వేసుకొని పెళ్లి కొడుకు చెప్పులు దొంగలిస్తాడు. తన సోదరుడు చేసిన వినోదభరితమైన పనిని వీడియో తీసిన వధువు ‘జూటా హీస్ట్’ అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఆ వీడియోకు ఇప్పటివరకు 1.24 లక్షల లైక్స్ వచ్చాయి. 2.7 మిలియన్ పైగా వీక్షించారు. పెళ్లిలో మనీ హీస్ట్ దొంగ అంటే కామెంట్స్ పెడుతున్నారు.