ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి టీచర్లు మరింత కృషి చేయాలి

  • ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి టీచర్లు మరింత కృషి చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని టీజేఎస్ ఆఫీసులో టీఎస్టీయూ డైరీ, క్యాలెండర్​ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, రాజిరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.

 ఈ సందర్బంగా కోదండరామ్ మాట్లాడారు. టీచర్లు,ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏ సమస్యలపై ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో టీఎస్టీయూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వర్, సురేందర్, షబానా మునావర్, నర్సయ్య పాల్గొన్నారు.