నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

ఎమ్మెల్యే సంజీవరెడ్డి 

పెద్దశంకరంపేట, వెలుగు: ఇండ్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండల పరిధిలోని చీలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్​ను కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమ నియోజకవర్గానికి అదనంగా ఇండ్లు  మంజూరు చేయాలని జిల్లా ఇన్​చార్జి మంత్రిని కోరినట్లు తెలిపారు. 

కలెక్టర్ మాట్లాడుతూ  క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తూ ఆన్​లైన్​లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో యాదయ్య, తహసీల్దార్​ గ్రేసీబాయి, ఎంపీడీవో రఫీ ఉన్నీసా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, సంతోష్ కుమార్,  రాజన్ గౌడ్, సంగమేశ్వర్, రాములు పాల్గొన్నారు.

 సీసీరోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన

నారాయణ్ ఖేడ్: ఖేడ్​ మున్సిపల్​పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.20 కోట్లతో నిర్మించే సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎంపీ సురేశ్​షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్​ప్రభుత్వం పదేళ్లలో ఖేడ్ ​పట్టణంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు, తహేర్ అలీ, వినోద్ పాటిల్, పండరి రెడ్డి, ముంతాజ్ సెట్ పాల్గొన్నారు.