కారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి

కారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి

కేరళలో విషాదం జరిగింది. కొచ్ఛికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(24) రన్నరప్ అంజనా షాజన్(25) చనిపోయారు. ఇవాళ (సోమవారం) కొచ్ఛి సమీపంలోని  వైటిల్లా ఎడపల్లి దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో కారు పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే  ఇద్దరు మోడల్స్ చనిపోగా.. డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  అన్సీ, అంజనా డెడ్ బాడీలను  పలారి వట్టంలోని ఎర్నాకులం మెడికల్ సెంటర్ ఆస్పత్రికి తరలించారు.

అన్సీ కబీర్ ది తిరువనంతపురం కాగా.. అంజనా షాజాన్ కొచ్ఛికి చెందిన వారు. వీరిద్దరూ  మిస్‌ కేరళ 2019 కాంపిటీషన్‌ నుంచి క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు.